::: పంచాయతీ వ్యవస్థ :::
» పంచాయతీ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్ (అక్టోబర్ 2, 1959). |
» పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (నవంబర్ 1, 1959). |
» మూడంచెల పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ (1957). |
» రెండంచెల పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ (1977). |
» పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి సూచించిన కమిటీ ఎం.ఎం.సింఘ్వి కమిటీ (1986). |
» 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది. |
» పంచాయతీ నిర్మాణం రాజ్యాంగంలోని 9వ భాగంలో ప్రకరణ 243 (ఎ) నుంచి 243 (ఒ) వరకు ఉంది. |
» 11వ షెడ్యూల్‌లో పంచాయతీలకు 29 విధులను కేటాయించారు. |
»ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం (1994) 3 అంచెల వ్యవస్థను సూచించింది. (1) మొదటి అంచె - గ్రామ పంచాయతీ (2) రెండో అంచె - మండల పరిషత్ (3) మూడో అంచె - జిల్లా పరిషత్ |
» గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి సర్పంచ్. |
» సర్పంచ్ పంచాయతీ సమావేశాలకు (గ్రామసభ) అధ్యక్షత వహిస్తాడు. |
» గ్రామ పంచాయతీకి ప్రభుత్వ అధికారి కార్యదర్శి. |
» సర్పంచ్ పదవీ కాలం 5 సంవత్సరాలు. |
» సర్పంచ్‌గా పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయసు 21 సంవత్సరాలు. |
» సర్పంచ్‌కు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది. |
» మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు రూ.1000 గౌరవ వేతనం ఇస్తారు. (ప్రభుత్వం రూ. 500 చెల్లిస్తుంది. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.500 చెల్లిస్తారు) |
» మైనర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు రూ.600 గౌరవ వేతం ఇస్తారు. (ప్రభుత్వం రూ. 300 ఇస్తుంది. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.300 చెల్లిస్తారు) |
» సర్పంచ్ లేని సమయంలో ఉపసర్పంచ్ బాధ్యతలను నిర్వర్తిస్తారు. |
» క్రమానుసారంగా పంచాయతీ ఖాతాలను ఆడిట్ చేయించని సర్పంచ్, ఉప సర్పంచ్ తమ పదవులను కోల్పోతారు. |
» ఎన్నికలకు సంబంధించిన వివాదాల్లో ఒక వ్యక్తికి శిక్ష పడితే, పంచాయతీరాజ్ చట్టంలోని 233వ సెక్షన్ ప్రకారం... శిక్ష పడిన రోజు నుంచి 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. |
» సర్పంచ్ తన రాజీనామాను గ్రామపంచాయతీకి పంపాలి. |
» అన్ని రాష్ట్రాల్లోనూ పంచాయతీ సభ్యులను ప్రత్యక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకుంటారు. |
» వార్డు సభ్యులకు ఎలాంటి వేతనాలు చెల్లించరు. |
» సమావేశాలు నిర్వహించినప్పుడు వార్డు సభ్యులకు రూ.75 చెల్లిస్తారు. |
No comments:
Post a Comment