May 07, 2019

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి తెలుసుకోవాలి...

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి తెలుసుకోవాలి...



Part-1

అందుకే వివిధ వార్తా ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్లు, విశ్వ‌స‌నీయ వెబ్ సైట్ల ద్వారా మొద‌ట స్టాక్ మార్కెట్ల గురించి అవ‌గాహ‌న తెచ్చుకోవాలి.

స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియ‌కుండా కంపెనీల షేర్ల‌ను కొనుగోలు చేయ‌డం అనేది ఈత రాకుండా నూతిలో దూక‌డం లాంటిది. ఎందుకంటే ఈత రాక‌పోతే ఎలాగైతే గిలాగిలా కొట్టుకుంటారో, పెట్టుబ‌డులు పెట్టిన త‌ర్వాత మార్కెట్ ఒడిదుడుకుల‌కు లోనైనప్పుడు సైతం మీ ప‌రిస్థితి దాదాపు అలానే ఉంటుంది. అందుకే వివిధ వార్తా ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్లు, విశ్వ‌స‌నీయ వెబ్ సైట్ల ద్వారా మొద‌ట స్టాక్ మార్కెట్ల గురించి అవ‌గాహ‌న తెచ్చుకోవాలి. 
ఇలా వివిధ రకాల మార్గాల ద్వారా మనం తెలుసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే “స్టాక్” అనేది ఒక కంపెనీకి సంబంధించిన వాటాలలో ఒక భాగం అనీ, ఒక “స్టాక్” కలిగి ఉండడం అంటే, ఒక నిష్పత్తి ప్రకారం ఆ కంపెనీ లాభ నస్టాలలో కూడా వాటా కలిగి ఉండడం అనీ, ఎన్ని ఎక్కువ “స్టాక్స్” కలిగి ఉంటే అంత ఎక్కువ వాటా ఆ కంపెనీ లో కలిగి ఉండడం అనీ అర్థమౌతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ‘స్టాక్’, ‘షేర్’, ‘ఈక్విటీ’, ఇవి అన్నీ ఒకే అర్థాన్ని సూచిస్థాయి.
ఈ విధంగా ఒక అవగాహన అంటూ ఏర్పడిన తర్వాత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి:
1. రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం Derivatives లో Day Trading చేసేవాళ్ళు Risk appetite అనే అంశాన్ని సరిగా అర్థం చేసుకుని అంతకు మించి పెట్టుబడిని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎంత డబ్బు నష్టపోతే మీరు బాధ పడకుండా ఉంటారో అదే మీ Risk appetite 
“నా వద్ద ఉన్న రూ.1000 పోయినా పరవాలేదు అనుకుంటే ఆ రూ.1000 రిస్క్ ఆప్పేటైట్ అవుతుంది”.
2. GREED (దురాశ) 
“Never be greedy with the markets” 

మీరొక స్టాక్ ను రూ.100 కు కొన్న తర్వాత ఆ స్టాక్ రేటు రూ.150 కు చేరుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న వాటిలో కొన్నింటిని అమ్మి వేసి ప్రాఫిట్ బుక్ (Profit Booking) చేసుకోవాలి. ఇంకా పెరుగుతుందేమో అన్న ఆశతో అమ్మకుండా ఉన్నట్లైతే ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 

3. DIVERSIFICATION : 
“Never put all your eggs in one basket” 

పెట్టుబడి రంగాల్లో (స్టాక్ మార్కెట్,బంగారం, రియల్ ఎస్టేట్) దేనిలోనైనా సరే ఒకే రంగంలో మనం ఎక్కువ మొత్తం ఉంచడం సరైన పద్ధతి కాదు. అదే విధంగా స్టాక్ మార్కెట్ లో కూడా మన పెట్టుబడి అంతటినీ ఒకే సెక్టార్ లో కేంద్రీకరించకుండా అన్నీ రంగాల మధ్య సమతూకం పాటించడం మంచిది. 

SUBSCRIBE for Part 2 
Is this article useful to you?
1.Yes
2.No
3.Lite
4.Bad


Please write below comment box

No comments:

Post a Comment