హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 237 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,974 కే చేరాయని తెలంగాణ ప్రభుత్వ వైద్య,ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 185 కు చేరాయి. తెలంగాణలో యాక్టివ్ కేసులు 2,412 ఉండగా.. 2,377 మంది డిశ్చార్జి అయ్యారు.
హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజునే 195 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 8, సంగారెడ్డిలో 5, మంచిర్యాలలో 3 కొత్త కేసులు తేలాయి. అలాగే, వరంగల్ అర్బన్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, వరంగల్ రూరల్, మెదక్, సిరిసిల్ల, ఆదిలాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున రికార్డయ్యాయి.
No comments:
Post a Comment