June 05, 2020
వారిద్దరూ హెచ్‌ఐవీ పెషంట్లు.
వారిద్దరూ హెచ్‌ఐవీ పెషంట్లు. కౌన్సెలింగ్ నిమిత్తం నెలలో రెండు మూడు కౌన్సెలింగ్
కేంద్రానికి వెళ్లేవారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సమన్వయం కుదరడం.. అధికారుల
జోక్యం.. వెరసి.. మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. కానీ ఏమైందో ఏమోగానీ పెళ్లి అయిన వారం
రోజులకే భర్త ముఖం చాటేయడంతో భార్య అత్తారింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన మహబూబ్
నగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు
చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీతో బాధపడుతున్నారు. నెలలో రెండుమూడు సార్లు మహబూబ్
నగర్‌లోని కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చేవాడు. ఇదే క్రమంలో మహబూబ్ నగర్‌కు చెందిన ఓ
యువతి సైతం కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లేది. ఈ క్రమంలో వీరిద్దరిని కౌన్సెలింగ్
కేంద్రం సిబ్బంది సమన్వయం కుదిర్చి ఫిబ్రవరి ఒకటో తేదీన వివాహం జరిపించారు.
భార్యభర్తలిద్దరూ వారం రోజుల పాటు బాగానే కాపురం చేశారు. ఆ తర్వాత ఏమైందో గానీ ఓ
రోజు భర్త సినిమాకు వెళ్తునానంటూ బయటకు వెళ్లాడు. మూడు నెలలైనా ఇంతవరకు తిరిగి
ఇంటికి రాలేదు. దీంతో భార్య అత్తారింటి ఎదుట ఆందోళనకు దిగింది.
Subscribe to:
Post Comments (Atom)
-
10 Freelancing Websites that Pay through Payoneer Those who are acquainted with the Freelance industry know the value of Payoneer. It’s one...
-
ఉద్యోగాలు ఈ కొలువులకు ఇంటర్ చాలు! ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇప్పుడేం చేయాలి? ఇక డైరెక్ట్‌గా జాబ్‌లోకి వెళ్లిపోవచ్చు. విద్యార్హత చిన్న...
-
ANU SCRIPT MANAGER FOR WINDOWS 7 ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using) ...
No comments:
Post a Comment